భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ పట్టణములోని సమస్త ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ షాపులు మరియు మెడికల్ ల్యాబుల యజమానులతో తేదీ: 16-10-2026 రోజున హుజురాబాద్ పురపాలక సంఘ కమిషనర్ పురపాలక సంఘము నందు సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది.
ఇట్టి సమావేశము నందు ఆసుపత్రులు, మెడికల్ షాపులు మరియు మెడికల్ ల్యాబుల నుండి వెలువడే హానికరమైన బయో మెడికల్ వేస్టును ఆరు బయట, మునిసిపల్ ట్రాక్టర్ నందు వేయకుండా ప్రజలకు మరియు పర్యావరణమునకు ఎలాంటి హాని కలగకుండా బయో మెడికల్ వేస్టును ప్రత్యేకముగా సేకరించే వారికి అందించి, పట్టణ సుందరీకరణకు సహకరించుటకు మరియు ప్రతి ఆర్ధిక సంవత్సరము విధిగా పురపాలక సంఘము నుండి ట్రేడ్ లైసెన్స్ తీసుకొనుటకు తెలుపడం జరిగినది.
ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి బయో మెడికల్ వేస్టును ఆరుబయట వేసిన వారి పై పురపాలక పరిపాలనా చట్టము 2019 క్రమము చర్యలు గైకొనబడును.
ఇట్టి కార్యక్రమము నందు పురపాలక సంఘ మేనేజర్ శ్రీ ఆర్. భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ డి. కిరణ్, మెడికల్ షాపులు మరియు ల్యాబుల యజమానులు కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కర్ర పాపిరెడ్డి (శ్రీ మాత హాస్పిటల్ ) కార్యదర్శి శ్రీ సంగెం శ్రీనివాస్, కోశాధికారి శ్రీ శ్రీనివాస్ రెడ్డ , శ్రీ దాసి కుమారస్వామి, డాక్టర్ శ్రీ శ్రీనివాస్, దుర్గ హాస్పిటల్ పాల్గొన్నారు.
కావున సమస్త హుజురాబాద్ పట్టణ పాత్రికేయ మిత్రులందరూ ఇట్టి విషయమును పట్టణ ప్రజలకు తెలియజేయు నిమిత్తము మీమీ దినపత్రిక నందు ప్రచురణ చేయుటకు గాను తమరిని కోరనైనది.