పార్థివదేహ దానానికి రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతి విధానం అమలు చేయాలి

డీఎంఈ డాక్టర్ వాణికి తెలంగాణ శరీర అవయవదాతల సంఘం వినతి  పది కీలక డిమాండ్లతో వినతిపత్రం భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, అక్టోబర్ 16తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పార్థివదేహ దానానికి ఏకరీతి మార్గదర్శకాలు అమలు చేయడంతోపాటు, శరీరదానం, అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ శరీర అవయవదాతల సంఘం (TGBODA) కోరింది. ఈ మేరకు పది కీలక డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సంఘం ప్రతినిధి బృందం శుక్రవారం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్...