BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 6:46 pm Posted by : Reporter Srikanth

దుర్గామాతకు ప్రత్యేక పూజలు.. పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని మనోజ్ రావు

హుజురాబాద్‌లో దుర్గామాతకు ప్రత్యేక పూజలు.. పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని మనోజ్ రావు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: పట్టణంలో దుర్గామాత ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుర్గామాత ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఉత్సవాల సమయంలో భక్తులు పరస్పర సహకారంతో వ్యవహరిస్తూ, ఆధ్యాత్మిక భావనలను పెంపొందించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకట్, సునీత బాబు, ప్రశాంతి మురళి, వార్డు ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.