BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 7:09 pm Posted by : Reporter Srikanth

పేదల పక్షాన పోరాటలకు సిద్ధం సాగుదారులకు స్వాధీన హక్కులు

దండేపల్లి శివారులో బీపీసీఎల్ ప్లాంట్ నిర్మాణ సన్నాహాలను తక్షణమే .

పేదల పక్షాన పోరాటలకు సిద్ధం సాగుదారులకు స్వాధీన హక్కులు కల్పించాలి.మారుపాక అనిల్ కుమార్
DHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో బీపీసీఎల్ (భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణానికి అధికారులు చేస్తున్న సన్నాహాలను తక్షణమే విరమించుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి (DHPS) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

దండేపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 439లో మొత్తం 170 ఎకరాల 27 గుంటల ప్రభుత్వ భూమి ఉందని, 1992లో ఈ భూమిని 299 మంది నిరుపేదలకు పంపిణీ చేశారని అనిల్ కుమార్ తెలిపారు. భూమిలేని పేద కుటుంబాలకు జీవనాధారంగా ఉండాల్సిన ఈ భూమిపై ఇప్పుడు బీపీసీఎల్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణానికి సన్నాహాలు చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

భూమిలేని పేదలకు పంపిణీ చేసిన భూములను వారి నుంచి దూరం చేసే చర్యలకు ప్రభుత్వం పాల్పడకూడదని ఆయన పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అభివృద్ధి పేరుతో పేదల జీవనాధారాన్ని దెబ్బతీసే చర్యలను అనుమతించరాదని స్పష్టం చేశారు.

సర్వే నంబర్ 439లోని భూమికి సంబంధించిన అసలు రికార్డులను ప్రభుత్వం బహిర్గతం చేయాలని, 1992లో భూమి పొందిన 299 మంది లబ్ధిదారుల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం భూమిని సాగు చేసుకుంటున్న వారిని గుర్తించి, అర్హులైన సాగుదారులకు చట్టబద్ధమైన స్వాధీన హక్కులు కల్పించాలని కోరారు. భూముల స్థితిగతులు, లబ్ధిదారుల హక్కులపై సమగ్ర విచారణ జరిపిన తర్వాతే ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకోవాలని అన్నారు.ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే స్పందించి బీపీసీఎల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన సన్నాహాలను నిలిపివేయాలని, భూమి లబ్ధిదారులు మరియు ప్రస్తుత సాగుదారుల హక్కులకు రక్షణ కల్పించాలని మారుపాక అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు వారి భూముల పరిరక్షణ కోసం DHPS ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ సమావేశం లో సర్వే నంబర్ 439 భూ పరిరక్షణ సంఘం అధ్యక్షులు కామెర లక్ష్మణ్, డి హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి నిమ్మల మనోహర్, రేణిగుంట్ల సాంబయ్య, గడ్డం రాజనర్సు, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.