దసరా–బతుకమ్మ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భీమ్ ఇండియా టుడే న్యూస్  హుజురాబాద్: దసరా, బతుకమ్మ పండుగలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకునేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఇటీవల హుజురాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా...