ఆత్మీయ కుటుంబ సభ్యులకు అండగా వొడితల ప్రణవ్
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పర్యటన.. కుటుంబ సభ్యులను పరామర్శించి యోగక్షేమాల ఆరా హుజూరాబాద్: ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, ఆత్మీయ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ తన పర్యటనను కొనసాగించారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో పర్యటించిన ఆయన, ఆయా ప్రాంతాల్లోని ఆత్మీయ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడిన వొడితల ప్రణవ్, వారి కుటుంబ...