భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్ నీన్నటి రోజు ( 11 అక్టోబర్ 2026 ) కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయం లో దేవి నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా
అమ్మవారి సన్నిధిలో ఉన్న కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారిని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ మర్యాద పూర్వకంగా కలసి అమ్మవారి దీక్షలో ఉన్న శ్రీ బండి సంజయ్ గారిని అభినందించి పలు చేనేత అంశాలపై చర్చించారు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పహాచాన్ కార్డ్స్ జారీ లో చాలా ఆలస్యం జరుగుతుందని వివరించారు
కార్డ్స్ అందక చేనేత స్టాండ్ మగ్గాల సబ్సిడీ స్కీం లో జాప్యం జరిగి చేనేత కార్మికులకు నష్టం జరుగుతుందని వివరించారు ఈ విషయం మీద చేనేత జౌళి శాఖ అధికారుల తో మాట్లాడి
వీలైనంత త్వరగా పహాఛాన్ కార్డ్స్ జారీ చేయిస్తానని హామి ఇచ్చారు మంత్రి వర్యులు ఈ కార్య క్రమంలో తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండేటి రమేశ్ మహిళా విభాగం నాయకురాలు శ్రీమతి రాజేశ్వరి పాల్గొన్నారు రావిరాల శ్రీనివాస్ నేత సోషల్ మీడియా కార్యదర్శి తెలంగాణ చేనేత ఐక్య వేదిక హైదరాబాద్