BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 10:36 pm Posted by : Reporter Srikanth

హైదరాబాద్‌లోని అమరవీరుల స్మారక దీపం వద్ద వేడుకలు

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

భీమ్ ఇండియా టుడే న్యూస్  హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ తెలిపారు.

హైదరాబాద్‌లోని సచివాలయం ఎదుట ఉన్న అమరవీరుల స్మారక దీపం వద్ద అక్టోబర్ 15, 2026న ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహిళల ఐక్యతను చాటుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఉద్యమ సంఘాల మహిళా నాయకురాళ్లు, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మహిళా నాయకురాళ్లు, వివిధ పార్టీలకు అతీతంగా మహిళా ఉద్యమకారులు, అక్కచెల్లెమ్మలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని భోగే పద్మ పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ, మహిళలంతా ఒకే వేదికపై కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. పార్టీలకు అతీతంగా మహిళలందరూ ఐక్యంగా పాల్గొని తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతను, ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేశారు.భోగే పద్మ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్