BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 6:57 pm Posted by : Reporter Srikanth

ఆడపడుచులందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బీసీ జాతీయ సంక్షేమ సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ మహిళా జనరల్ సెక్రటరీ దేవసాని ప్రియదర్శిని

భీమ్ ఇండియా టుడే న్యూస్  హుజూరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఆడపడుచులందరికీ బీసీ జాతీయ సంక్షేమ సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ మహిళా జనరల్ సెక్రటరీ దేవసాని ప్రియదర్శిని ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే బతుకమ్మ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, ఆటపాటలతో జరుపుకునే ఈ పండుగ మహిళల ఐక్యతకు, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.

ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ పూల పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, ప్రతి కుటుంబంలో ఐక్యత, ప్రేమానురాగాలు వెల్లివిరియాలని ఆమె ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలను తీసుకురావాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

అమ్మవారి ఆశీస్సులతో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరగాలని, మహిళలు, కుటుంబ సభ్యులు సుఖశాంతులతో వర్ధిల్లాలని దేవసాని ప్రియదర్శిని ఆకాంక్షించారు. తెలంగాణ ఆడపడుచులందరూ భక్తి, ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.