విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ
ఎస్సీ గురుకులాల కార్యదర్శి రవి గుగులోత్ భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, అక్టోబర్ 8: ఎస్సీ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఎస్సీ గురుకులాల కార్యదర్శి రవి గుగులోత్ తెలిపారు. గురుకులాల పనితీరు, విద్యార్థుల సమస్యలు, విద్యా ప్రమాణాలపై బుధవారం జోనల్ అధికారులు, డీసీవోలతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన సమీక్షించారు. గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణంతో పాటు నాణ్యమైన వసతి, పారిశుధ్యం, భద్రత, ఆరోగ్యం, పోషకాహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని...