భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్‌ నూతన కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా మాడుగుల రాజ్‌కుమార్‌.. ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి మండల ప్రెస్‌ క్లబ్‌ (రి. నెం. 629/2022) నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని కొత్త కొండలో నిర్వహించిన సమావేశంలో మండలానికి చెందిన 20 మంది విలేకరులతో సీనియర్‌ విలేకరి, గౌరవ అధ్యక్షుడు మాడుగుల సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా మాడుగుల రాజ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా మాడుగుల రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా గౌడ చంద్రబాబు, కోశాధికారిగా ఉడుత శ్రీనాథ్‌, కార్యదర్శిగా కనకం వెంకటేశ్‌ ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను...