ప్రమోషన్‌ కోసం పాతికేళ్ల నిరీక్షణ!

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణలో ఎస్‌జీటీలు 25–30 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితిపై విశ్లేషణ.. 30 ఏళ్ల సర్వీసుకు ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కేల్‌, ప్రమోషన్లు, వేతన ప్రయోజనాలపై ఉపాధ్యాయుల డిమాండ్లు. విద్యాబోధనలో కీలక పాత్ర పోషిస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్‌జీటీ) ఉద్యోగ జీవితంలో మాత్రం ఎదుగుదల కరువైంది. మారుమూల గ్రామాలు, తండాల్లో ఏళ్ల తరబడి సేవలందిస్తున్నా.. పదోన్నతి కోసం పాతికేళ్లకు పైగా ఎదురు చూడా ల్సిన పరిస్థితి నెలకొంది. చివరకు ప్రమోషన్‌ వచ్చినా ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు...