BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 4:01 pm Posted by : Reporter Srikanth

ఘనంగా కాన్సీరామ్ 29వ వర్ధంతి

నివాళి అర్పించిన బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు

భీమ్ ఇండియా టుడే  జోగులాంబ ::(ఇటిక్యాల )::- రాజ్యాధికారమే మాస్టర్g మాన్యశ్రీ దివంగత కాన్సీరామ్ అని ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు అన్నారు. శుక్రవారం ఇటిక్యాల మండల కేంద్రంలో కాన్సీరామ్ 20వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక ఓటు – ఒక నోటు నినాదంతో ప్రజల నుండి డబ్బులను సేకరించి వారినీ రాజకీయాల వైపు ప్రేరేపించిన ధీరుడుఅన్నారు. 85% జనాభా నీతో ఉన్నప్పుడు 15% జనాభా మీద ఎందుకు ఆధారపడాలని ప్రజలను చైతన్యవంతం చేశారనీ గుర్తు చేశారు. బహుజనుల సంఖ్యాబలాన్ని సామాజిక రాజకీయ శక్తిగా మలిచారని పేర్కొన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలో అడుగు పెట్టాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ప్రజలకు స్వాభిమానాన్ని నేర్పిన యోధుడు కాన్షీరామ్ అని అన్నారు. కాన్సీరామ్ ఓబీసీల కోసం నిరంతరం ఉద్యమాలు చేసి మండల కమిషన్ సిఫారసులను అమలు చేయండి లేదా మీ కుర్చీలను ఖాళీ చేయండి అని ప్రశ్నించిన గొంతుక ఆయన పోరాట పటిమలను ప్రజలకు వివరించారు. ఓబీసీల రిజర్వేషన్ల కొరకు ఢిల్లీలోని బొట్స్ క్లబ్ వద్ద జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించారని.. ఓబీసీల సమస్య దేశ సమాసాన్ని ప్రశ్నించిన పోరాట వీరుడు కాన్షీరామ్ అని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కలలుగన్న రాజ్యాన్ని ఉత్తరప్రదేశ్లో సోషల్ ఇంజనీరింగ్ తో సాధించిన మహనీయుడు కాన్సీరామ్ గారు అని అన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చే బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలపై ఎంతైనా ఉందని పేర్కొన్నారు.అనంతరం నేడు బడంగ్ పేట్ లో జరిగే కాన్సీరామ్ వర్ధంతి సభకు తరలి వెళ్లడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఈసీ సభ్యులు దుబ్బన్న, పెరపోగు రమేష్, విల్సన్, చాగాపురం రాజు, నర్సన్న, శాంసన్, లాజర్, ఏసన్న, నల్లన్న, నాగన్న, శివన్న, ఇతరులు ఉన్నారు.