ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను పునరాలోచించాలి..సామాన్యుడిపై వరుస భారాలు ఎందుకు.?
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ మండలం బిఆర్ఎస్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ.
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.కూరగాయలు, వంట నూనె, పాలు, విద్య, వైద్యం, రవాణా వంటి ప్రతి రంగంలో కుటుంబాల ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటు న్నాయి అని హుజురాబాద్ మండలం బిఆర్ఎస్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలను మరో సారి పెంచే ప్రతిపాదన తీసుకురావడం ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపే నిర్ణయంగా మారు తుంది అన్నారు. విద్యుత్ అనేది విలాసం కాదు?ప్రతి కుటుంబానికి, ప్రతి చిన్న వ్యాపారానికి, ప్రతి రైతుకు, ప్రతి పరిశ్రమకు అత్యవసర మైన సేవ. చార్జీలు పెరిగితే కేవలం ఇంటి విద్యుత్ బిల్లు మాత్రమే కాదు, ఉత్పత్తి, వ్యాపారం, సేవల ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. చివరికి ఆ భార మంతా సామాన్య ప్రజలపైనే పడుతుంది. ప్రజల ఆదాయాలు అదే స్థాయిలో ఉన్నప్పుడు ఖర్చులుమాత్రం వరుసగా పెరుగుతుంటే, ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కల్పించేచర్యలు తీసుకోవాలి, మరో భారం మోపే ముందు సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను పునరాలోచించి, ప్రజలపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజల జీవితాలను భారంగా మార్చేనిర్ణయాలు కాదు?ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాలు కావాలి అని సామాన్యుడిపై భారం వద్దు?విద్యుత్ చార్జీల పెంపు వద్దు.?హుజురాబాద్ మండలం బిఆర్ఎస్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ.