ప్లాస్టిక్ నోట్లకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్  న్యూఢిల్లీ: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక అడుగు వేసింది. తొలిదశలో రూ.10, రూ.20 విలువైన ప్లాస్టిక్ నోట్లపై ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రయోగాత్మకంగా ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు అర్హత కలిగిన కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించినట్లు ఆర్బీఐ అనుబంధ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) చర్యలు చేపట్టింది....