BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 5:50 pm Posted by : Reporter Srikanth

అనారోగ్యంతో మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబానికి చేయూత

అనారోగ్యంతో మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబానికి చేయూత

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన ఆటో డ్రైవర్లు.. రూ.7 వేల ఆర్థిక సాయం

భీమ్ ఇండియా టుడే న్యూస్: ఎల్కతుర్తి మండలం ఎల్కతుర్తి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జంగం రాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. విషయం తెలుసుకున్న హుజురాబాద్ డీజన్ పాపారావు బొందా అధ్యక్షులు ఇసంపల్లి రాజేందర్ ఉపాధ్యక్షులు కొంగ ప్రవీణ్ క్యాంపు శీను రెంటాల లక్ష్మణ్ఆధ్వర్యంలో వివిధ గ్రామాల ప్రెసిడెంట్లు ఆటో డ్రైవర్లు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, తమ వంతు సహాయంగా రూ.7,000 ఆర్థిక సాయం అందజేశారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో చల్లూరి వేణు, ఎం.డి. అంకుష్ , రెంటాల లక్ష్మణ్, ఎల్కతుర్తి మాజీ ప్రెసిడెంట్ లోకిని తిరుపతి, సీనియర్ డ్రైవర్ ఎల్కతుర్తి ప్రెసిడెంట్ ఈరా సంపత్‌తో పాటు పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.