ఇంద్రానగర్‌లో బీజేపీకి భారీ జోష్!

వార్డు మెంబర్‌తో పాటు యువత బీజేపీలోకి చేరికలు మోదీ అభివృద్ధి, కేంద్ర పథకాలపై నమ్మకంతో కమలం గూటికి యువత భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలంలోని ఇంద్రానగర్ గ్రామంలో బీజేపీలోకి యువత చేరికలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామీణ ప్రాంతాలకు అందుతున్న కేంద్ర నిధులకు ఆకర్షితులైన వార్డు మెంబర్‌తో పాటు పలువురు యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇంద్రానగర్ మాజీ సర్పంచ్ కడారి ప్రసాద్, నమిండ్ల ప్రవీణ్...