BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 8:10 am Posted by : Reporter Srikanth

విద్యార్థి దశలోనే థియేటర్ ద్వారా సామాజిక సమస్యలపై గళం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేహా బోరా ఎవరు? ఆమె విద్యార్థి రాజకీయ ప్రయాణం ఎందుకు అంత ప్రత్యేకం?

29 ఏళ్ల నేహా బోరా ఉత్తరాఖండ్‌కు చెందిన యువ విద్యార్థి నాయకురాలు. ఆమె తండ్రి భారతీయ సైన్యంలో అత్యున్నత హోదాలో (ఆర్మీలో ఉన్నత అధికారిగా) దేశానికి సేవ చేసిన వ్యక్తి. 

మిలిటరీ నేపథ్యం, నుంచి వచ్చినప్పటికీ సమాజంలోని అసమానతలను, ప్రభుత్వాల వైఫల్యాలను ప్రశ్నించే దృక్పథాన్ని నేహా ఎంచుకున్నారు. 

ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసిన నేహా , 

ప్రస్తుతం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో థియేటర్ అండ్ పెర్ఫార్మెన్స్ విభాగంలో PhD రీసెర్చ్ స్కాలర్‌గా కొనసాగుతున్నారు.

విద్యార్థి దశలోనే థియేటర్ ద్వారా సామాజిక సమస్యలపై గళం ఎత్తిన ఆమెకు, ఒక పొలిటికల్ థియేటర్ గ్రూప్ ద్వారా వామపక్ష AISAతో పరిచయం ఏర్పడింది. 

అక్కడి నుంచి విద్యార్థి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె, 2019లో CAA వ్యతిరేక ఉద్యమాల్లోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు.

దేశాన్ని కుదిపేస్తున్న పేపర్ లీకులు, పరీక్షల పారదర్శకత లోపాలు, తీవ్రమైన నిరుద్యోగం మరియు విద్యా వ్యవస్థ వైఫల్యాలపై ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. 

జంతర్ మంతర్ వద్ద ఏకంగా 23 రోజుల పాటు అసాధారణమైన నిరాహార దీక్ష చేపట్టడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. 

నిన్న ఢిల్లీలో బీజేపీ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం జరిగిన నిరసనలో పోలీసులు ఆమెను చుట్టూ ముట్టి బలవంతంగా అరెస్ట్ చేయాలని బీజేపీ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించింది. 

పోలీసులు ఆమెను అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ఆమె చూపిన అసాధారణ తెగింపు, పోరాట పటిమ ముందు పోలీసుల బలప్రయోగం తేలిపోయింది; 

ఆ ధైర్యం చూసి చివరకు పోలీసులే వెనకడుగు వేయాల్సి వచ్చింది.

యువత గొంతు నొక్కాలని, ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచివేయాలని బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా… నేహా బోరాను అడ్డుకోవడం ఆ పార్టీ వల్ల కాలేదు. 

ఆమె సంకల్పం ముందు పాలకవర్గాల బెదిరింపులు పూర్తిగా బలాదూర్ అయ్యాయి.

అధికార బలంతో ఎవరినైనా అణచివేయవచ్చనే అహంకారానికి, భయపడని ఒక యువత స్వరం ఎలా ఎదురునిలుస్తుందో నేహా బోరా నిరూపించారు. 

థియేటర్ వేదిక నుంచి విద్యార్థి ఉద్యమ రణరంగం వరకు ఆమె సాగిస్తున్న ఈ ప్రయాణం—నియంతత్వ పోకడలను ధైర్యంగా ఎదిరించే ప్రతి ఒక్కరికీ ఇదొక గొప్ప స్ఫూర్తిదాయక గాథ.