BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 3:43 pm Posted by : Reporter Srikanth

కోతుల బెడద నుండి పట్టణ ప్రజలను కాపాడాలి. 

మున్సిపల్ చైర్ పర్సన్ కు వినతి పత్రం అందించిన బీసీ జేఏసీ నాయకులు. బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న.

భీమ్ ఇండియా టుడే న్యూస్  హుజురాబాద్ పట్టణాన్ని కోతుల బెడద నుండి కాపాడాలని మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని గారికి హుజురాబాద్ బీసీ జేఏసీ నాయకులు బీసీ జేఏసీ పక్షాన వినతి పత్రము అందచేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరములుగా హుజురాబాద్ పట్టణప్రజలు కోతుల బెడద మూలంగా అనేక ఇబ్బందులకు గురి కావడమే కాకుండా ప్రాణ భయంతో తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. హుజురాబాద్ పట్టణ ప్రజల ను కోతుల బెడద నుండి రక్షించడానికి పట్టణానికి సుదూరంలో నున్న ప్రభుత్వ ఖాళీస్థలంలో పండ్ల మొక్కలను పెంచడంతో పాటు కోతులను హుజురాబాద్ పట్టణము నుండి పారద్రోలడానికి హుజురాబాద్ మునిసిపాలిటీ ప్రజా ప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకొని పట్టణ ప్రజలను కోతుల నుండి కాపాడవలసిన గురుతర మైన బాధ్యత మున్సిపాలిటీ సిబ్బంది పైన ఉందని అభి ప్రాయపడుతూ, తగు చర్యలు తీసుకుంటారని ఆశాభావాన్ని వెలిబుచ్చి నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, ఉపాధ్యక్షులు మామునూరు ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి కుమార్, బీసీ జాతీయ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజక వర్గం మహిళ జనరల్ సెక్రెటరీ దేవసాని ప్రియదర్శిని, రామ్ సారయ్య, దాట్ల ప్రభాకర్, పోగు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.