BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 11:12 pm Posted by : Reporter Srikanth

మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంటలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న చైర్మన్

జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పాడి కౌశిక్ రెడ్డితో కలిసి జమ్మికుంట పట్టణ పరిధిలో మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యేతో కలిసి పంపిణీ చేశారు.

అనంతరం మాజీ కౌన్సిలర్ గాజుల భాస్కర్ తండ్రి ప్రమాదవశాత్తు గాయపడడంతో వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించి, బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, గౌరవ కౌన్సిలర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.