పెండింగ్‌ చలాన్ల వసూళ్లకు కఠిన చర్యలు

కరెంట్‌ బిల్లులతో అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలన్న సుప్రీంకోర్టు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల వసూళ్లపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. వాహనదారులకు ఈ-చలాన్లు జారీ చేయడంతోనే ప్రక్రియ పూర్తికాదని, జరిమానాలను సమర్థవంతంగా వసూలు చేసేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొన్నట్లు సమాచారం. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలాన్లను కేవలం రికార్డుల్లో ఉంచకుండా వాటి వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. ఇందులో భాగంగా చలాన్ల బకాయిలను కరెంట్‌ బిల్లులతో అనుసంధానం...