ఆధార్ వ్యవస్థనే అబ్బురపరిచిన కవలలు!
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ డిజిటల్ యుగంలో ప్రతి పౌరుడికీ *'ఆధార్*' ప్రాథమిక గుర్తింపుగా మారింది. వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్) స్కాన్ల ఆధారంగా డిజిటల్ సిస్టమ్ ప్రతి ఒక్కరినీ విడివిడిగా గుర్తిస్తుంది. అయితే, ప్రకృతి సృష్టించిన ఒక అరుదైన పోలిక ఆధార్ కి సవాలుగా నిలిచింది. ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ కు చెందిన 10వ తరగతి కవలలు ఖిజ్రా జుబేర్, తూబా జుబేర్ల విషయంలో నమోదైన ఘటన సాంకేతిక నిపుణులను ప్రభుత్వ యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేసింది. సాధారణంగా ఒకే రూపం ఉన్న...