BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 11:01 am Posted by : Reporter Srikanth

ఆటో డ్రైవర్ల గుండెల్లో చెరగని ముద్ర… ఉద్యమ నేత జంగం రాజు కన్నుమూత

అనారోగ్యంతో 15 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి – ఎల్కతుర్తి మండలంలో విషాద ఛాయలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలానికి చెందిన ఉద్యమ నేత, ఆటో డ్రైవర్ జంగం రాజు అనారోగ్యంతో గత 15 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు మండలంలోని ఆటో డ్రైవర్లను తీవ్ర విషాదంలో ముంచింది.

ఆటోనే జీవనాధారంగా చేసుకుని ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తూ, తోటి ఆటో డ్రైవర్ల కష్టసుఖాల్లో అండగా నిలిచిన జంగం రాజు ఇక లేరన్న వార్తను ఆటో డ్రైవర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.

రాజు ఇక మన మధ్య లేకపోయినా… ఆయనతో గడిపిన జ్ఞాపకాలు, చేసిన సేవలు ఎప్పటికీ మా గుండెల్లో నిలిచిపోతాయి” అంటూ తోటి ఆటో డ్రైవర్లు భావోద్వేగానికి గురయ్యారు.

ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న జంగం రాజు మృతి ఒక కుటుంబానికే కాకుండా ఆయనను అభిమానించిన ప్రతి ఒక్కరికీ తీరని లోటని పలువురు పేర్కొన్నారు.

జంగం రాజు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ తీరని విషాదాన్ని భరించే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆటో డ్రైవర్లు, స్నేహితులు, అభిమానులు ప్రార్థించారు.