BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 5:20 pm Posted by : Reporter Srikanth

సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో నిర్వహణ – ముఖ్య అతిథిగా ఆర్టీఐ కమిషనర్ పీవీ. శ్రీనివాసరావు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ: సమాచార హక్కు చట్టం (RTI)పై ప్రజలు, పాత్రికేయులు మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్టీఐ కమిషనర్ పీవీ. శ్రీనివాసరావు అన్నారు.

హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యత, ప్రజలకు కలిగే ప్రయోజనాలు, చట్టాన్ని వినియోగించుకునే విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్టీఐ కమిషనర్ పీవీ. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం పౌరులకు లభిస్తుందని వివరించారు. చట్టం ద్వారా ప్రజలకు ఉన్న హక్కులు, సమాచారాన్ని కోరే విధానం, దరఖాస్తు ప్రక్రియ తదితర అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు.

ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చట్టంపై అవగాహన పెంచుకుని, అవసరమైన సందర్భాల్లో తమ హక్కులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.

ఈ అవగాహన సదస్సులో అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాత్రికేయులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరగడంతో పాటు, పాల్గొన్న వారికి సందేహాలను నివృత్తి చేశారు.