BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 5:40 pm Posted by : Reporter Srikanth

బొత్తలపల్లి ఉపసర్పంచ్‌ను పరామర్శించిన వన్నాల శివాజీ

బైక్ ప్రమాదంలో స్వల్ప గాయాలు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: బైక్ ప్రమాదంలో స్వల్ప గాయాలపాలైన బొత్తలపల్లి ఉపసర్పంచ్ పంజాల రాజును ఉపసర్పంచుల ఫోరం హుజురాబాద్ అధ్యక్షులు వన్నాల శివాజీ పరామర్శించారు. ఆదివారం బొత్తలపల్లిలోని పంజాల రాజు నివాసానికి వెళ్లిన వన్నాల శివాజీతో పాటు పలువురు నాయకులు, ఉపసర్పంచులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వన్నాల శివాజీ పంజాల రాజును పరామర్శించి, ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సాధారణ ఆరోగ్యంతో ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో మండ సతీష్, కందుగుల ఉపసర్పంచ్ శనిగరపు ఐలయ్య, రాజపల్లి ఉపసర్పంచ్ గిన్నరపు మహేందర్, జూపాక ఉపసర్పంచ్ బండి నరేష్, రంగాపూర్ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేష్, కందుగుల గుండారపు చంద్రశేఖర్, లింగాపూర్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.