పర్యాటక రంగ ప్రాధాన్యతపై అవగాహన కల్పించిన వక్తలు

కాకతీయ యూనివర్సిటీలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం భీమ్ ఇండియా టుడే న్యూస్ వరంగల్: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకతీయ యూనివర్సిటీలోని సెమినార్ హాల్లో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పర్యాటక రంగం ప్రాధాన్యత, తెలంగాణలోని చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాల విశిష్టతపై విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీ ప్రిన్సిపాల్ తాళ్లపల్లి మనోహర్తో పాటు పలువురు యూనివర్సిటీ ప్రొఫెసర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు....