కాకతీయ యూనివర్సిటీలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం
భీమ్ ఇండియా టుడే న్యూస్ వరంగల్: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకతీయ యూనివర్సిటీలోని సెమినార్ హాల్లో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పర్యాటక రంగం ప్రాధాన్యత, తెలంగాణలోని చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాల విశిష్టతపై విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీ ప్రిన్సిపాల్ తాళ్లపల్లి మనోహర్తో పాటు పలువురు యూనివర్సిటీ ప్రొఫెసర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పర్యాటక రంగం ద్వారా దేశ, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కలిగే ప్రయోజనాలు, ఉపాధి అవకాశాలు, చారిత్రక వారసత్వ పరిరక్షణ వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా యువత పర్యాటక రంగంపై అవగాహన పెంచుకుని తెలంగాణలోని చారిత్రక, సాంస్కృతిక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో భాగస్వాములు కావాలని సూచించారు.
కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు, పరిశోధన విద్యార్థులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పర్యాటక రంగంపై ఆసక్తి, అవగాహన పెంపొందించేందుకు దోహదపడిందని నిర్వాహకులు తెలిపారు.