BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 11:47 pm Posted by : Reporter Srikanth

బాలల సాంస్కృతికోత్సవ పోటీలకు రచనల ఆహ్వానం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం.. అక్టోబర్‌ 30లోగా రచనలు పంపాలి

హైదరాబాద్‌: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో బాలల సాంస్కృతికోత్సవాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం వివిధ సాంస్కృతిక, సృజనాత్మక పోటీలను నిర్వహించనున్నట్లు పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్య తెలిపారు.

పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత డా. కేఐ వరప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో శాంత–వసంత ట్రస్ట్‌ సౌజన్యంతో నవంబర్‌ 22న హైదరాబాద్‌ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలో బాలల సాంస్కృతికోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేలా పలు పోటీలు నిర్వహించడంతో పాటు సృజనాత్మక రచనలపై ప్రత్యేక సదస్సు కూడా నిర్వహించనున్నారు.

పోటీలు ఇవే..

గేయం / పాట పద్య కవిత వచన కవిత కథ యాత్రా రచన చిత్రలేఖనం పర్యావరణ అంశంపై

పోటీల్లో పాల్గొనదలచిన విద్యార్థులు తమ రచనలను అక్టోబర్‌ 30లోగా పంపించాలని నిర్వాహకులు సూచించారు.

రచనలు పంపాల్సిన చిరునామా:

తెలంగాణ సారస్వత పరిషత్తు,తిలక్‌ రోడ్‌, బొగ్గులకుంట,అబిడ్స్‌, హైదరాబాద్‌–1.పోటీలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 96037 27234 నంబరులో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.