నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత, ప్రజాసేవ
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. దేశ ఆర్థిక ప్రగతికి దూరదృష్టితో దిశానిర్దేశం చేసిన మహనీయుడని అన్నారు. ఆర్థిక మంత్రిగా వారు చేపట్టిన సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులకు నాంది పలికి, దేశ అభివృద్ధి పయనంలో చారిత్రక మలుపుగా నిలిచాయని అన్నారు. ఎన్ని ఉన్నత పదవులు నిర్వహించినా సరళత, నిజాయితీ, నిబద్ధత,...