BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 10:33 am Posted by : Reporter Srikanth

నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత, ప్రజాసేవ

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. దేశ ఆర్థిక ప్రగతికి దూరదృష్టితో దిశానిర్దేశం చేసిన మహనీయుడని అన్నారు.

ఆర్థిక మంత్రిగా వారు చేపట్టిన సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులకు నాంది పలికి, దేశ అభివృద్ధి పయనంలో చారిత్రక మలుపుగా నిలిచాయని అన్నారు. ఎన్ని ఉన్నత పదవులు నిర్వహించినా సరళత, నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత, ప్రజాసేవ పట్ల అంకితభావాన్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎన్నడూ వీడలేదని ముఖ్యమంత్రి కొనియాడారు.

ప్రపంచ ఆర్థిక వేదికపై భారతదేశానికి గౌరవాన్ని తీసుకువచ్చిన దార్శనిక ఆర్థికవేత్తగా డాక్టర్ మన్మోహన్ సింగ్ అందించిన సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.