BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 4:04 pm Posted by : Reporter Srikanth

చాకలి ఐలమ్మ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

భూస్వామ్య దోపిడీ, అన్యాయానికి ఎదురు నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ

జహీరాబాద్ నియోజకవర్గం రంజోల్ కాలనీలో ఘనంగా 131వ జయంతి వేడుకలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని రంజోల్ కాలనీలో రజక సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) అధ్యక్షులు, శాంతి ఫౌండేషన్ చైర్మన్ సిద్దు రావణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిద్దు రావణ్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన వీరనారి అని కొనియాడారు. భూస్వామ్య దోపిడీ, అన్యాయానికి ఆమె ధైర్యంగా ఎదురు నిలిచారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం, హక్కుల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

చాకలి ఐలమ్మ ఆశయాలు నేటి తరానికి కూడా ఎంతో స్ఫూర్తిని అందిస్తాయని సిద్దు రావణ్ తెలిపారు. ధైర్యం, న్యాయం, సమానత్వం కోసం నిలబడే స్ఫూర్తిని ఆమె జీవితం అందిస్తుందని అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ పట్టణ అధ్యక్షులు అలీమ్ హుస్సేన్, నాయకులు రాములు, విజయ్ కుమార్, ఆగమయ్య, బలరాం, బాల్రాజ్, రజక సంఘం నియోజకవర్గ నాయకులు వెంకటేశం, పెంటన్న, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.