శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోవడం
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ-టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ కె. వెంకన్న గారు గుర్తుతెలియని వాహనం ఢీకొన్న దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని వ్యాఖ్యానించారు. వెంకన్న గారి మరణం ఆయన కుటుంబానికే కాకుండా యావత్ పోలీసు శాఖకు తీరని లోటని అన్నారు. వెంకన్న గారి పవిత్ర...