BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 5:38 pm Posted by : Reporter Srikanth

సాయిబాబా ఆలయాన్ని దర్శించి అన్నదానo

సాయిబాబా ఆలయాన్ని దర్శించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న 

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ బిసి జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ హుజురాబాద్ పట్టణంలోని స్థానిక సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ వెంపటి సదానందం ఆహ్వానం మేరకు బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు మరియు బిసి జేఏసీ నాయకులు ఆలయాన్ని సందర్శించినారు అన్నదాన ప్రధాత మాము నూరి ప్రవీణ్ కుమార్ ను ఆలయ కమిటీ సభ్యులు బీసీ జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణంలోని సాయిబాబా గుడిలో ప్రతి గురువారము ప్రజల కొరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ అన్నదాతలు మావూరి ప్రవీణ్ కుమార్, ప్రణీత శ్రీయాన్ కుటుంబ సభ్యులతో పాటు కొలిపాక శంకర్ లలిత కుటుంబ సభ్యులను అభినందించినారు ఆ షిరిడి సాయిబాబా అనుగ్రహంతో హుజురాబాద్ పట్టణములోని ప్రజలతోపాటు ఇతర ప్రాంతాలలోని ప్రజలు కూడా భక్తి భావంతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యములతో సుభిక్షంగా జీవించాలని ఆ సాయిబాబాను మనస్ఫూర్తిగా వేడుకున్నట్లు తెలియజేసి నారు ఆ సాయినాధుని ఆశీస్సులతో ప్రజలు అందరి కొరకు మనం మన కొరకు అందరూ అనే భావనతో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ స్నేహపూర్వక వాతావరణంలో కలసిమెలసి ఉండాలని అభిప్రాయపడినారు ఇట్టి ఉత్సవ కార్యక్రమంలో ఆలయ పూజారి వరుణ్ శర్మ వైస్ చైర్మన్ ఇనుగాల సత్తిబాబు బీసీ సంక్షేమ జాతీయ సంఘం హుజురాబాద్ నియోజకవర్గం మహిళా జనరల్ సెక్రెటరీ దేవ సాని ప్రియదర్శిని జేఏసీ నాయకులు కొలిపాక క్రాంతి కుమార్ చిలుకమారి శ్రీనివాస్ మంచి కట్ల రమేష్ నడిగోటి రమేష్ తదితరులు పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలియజేసినారు