వాన దేవుడొచ్చి వరం ఇచ్చిపోయే… రైతు కళ్లల్లో ఆనందం

జోరుగా కురిసిన వర్షంతో పులకించిన పల్లెలు – వరి పంటపై మళ్లీ ఆశలు పెంచుకున్న రైతులు భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న వేళ ఒక్కసారిగా కురిసిన వర్షం రైతుల ముఖాల్లో ఆనందాన్ని నింపింది. ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో పొలాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో వరి పంటపై రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కొంతకాలంగా సరైన వర్షాలు లేకపోవడంతో వరి పంట పరిస్థితిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలకు నీరు అందక ఎండిపోయే...