సూర్యాపేట జిల్లాలో 28 MLHP పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
భీమ్ ఇండియా టుడే న్యూస్ సూర్యాపేట, సెప్టెంబర్ 22: సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కార్యక్రమం కింద మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలో మొత్తం 28 MLHP పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను 2026 సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు సమర్పించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
అభ్యర్థులు సూర్యాపేటలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలు తదితర సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
అభ్యర్థులు పూర్తి వివరాల కోసం సూర్యాపేట జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.