దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచారాల నిరోధక చట్టం (SC/ST (Prevention of Atrocities) Act, 1989) అమలుపై ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన డాక్టర్ బీఆర్...