BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 6:57 pm Posted by : Reporter Srikanth

కెనాల్ నందు వినాయక విగ్రహాల నిమజ్జనము చేయుటకు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్  రోజున వినాయక విగ్రహాల నిమజ్జనము సందర్బంగా హుజురాబాద్ పురపాలక సంఘ గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి సుహాసినీ రొంటాల గారి ఆధ్వర్యంలో పురపాలక సంఘము పరిధిలోని కరీంనగర్ ప్రధాన రహదారి ప్రక్కన గల కాకతీయ కెనాల్ నందు ప్రజల సౌకర్యార్థము నిమజ్జన ఏర్పాట్లను నిర్వహించడం జరుగుచున్నది.

ఇట్టి కార్యక్రమంలో పురపాలక సంఘ గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి సుహాసినీ రొంటాల, గౌరవ వార్డు కౌన్సిలర్లు, హుజురాబాద్ ఆర్.డి.ఓ. జలకుమారి గారు, పురపాలక సంఘ కమిషనర్ శ్రీ బి. కిషన్ మునిసిపల్ ఇంజనీర్ శ్రీ డి. నరేష్  సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ డి. కిరణ్  సానిటరీ జవాన్లు మరియు ఇతర మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

కావున తామందరూ పైన తెలిపిన విధముగా కరీంనగర్ ప్రధాన రహదారి ప్రక్కన గల కాకతీయ కెనాల్ నందు వినాయక విగ్రహాల నిమజ్జనము చేయుటకు గాను పట్టణ ప్రజలకు తెలియజేయు నిమిత్తము మీమీ దినపత్రిక నందు ప్రచురణ చేయుటకు గాను తమరిని కోరనైనది.