భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ సర్వే ద్వారా దివ్యాంగులకు బాద్యతలు.. పెన్షన్ కోసం అదనపు సిబ్బంది
తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
తెలంగాణలో అర్హులైన వృద్ధులకు నెలవారీగా కొత్త పెన్షన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గ్రామాల వారీగా అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం వివిధ కారణాలతో పెన్షన్లు పొందలేకపోతున్న అర్హులను గుర్తించి వారికి కూడా సామాజిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. పెన్షన్ల కోసం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఆదరణకు నోచుకోని వారికి ప్రాధాన్యత
కొత్త పెన్షన్ల మంజూరులో అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందని వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు దివ్యాంగులను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే పెన్షన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. గ్రామస్థాయిలో అర్హులైన వారిని గుర్తించి వారి వివరాలను సేకరించి, ప్రభుత్వానికి నివేదికలు అందించాలని సూచించారు.