భక్తిశ్రద్ధలతో అన్నదాన వితరణ – భారీగా పాల్గొన్న దండేపల్లి గ్రామ ప్రజలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మూడవ వార్డు మెంబర్ మాచర్ల స్వప్న, శంకర్ ఎల్కతుర్తి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మాచర్ల శంకర్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా సిద్ధి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దండేపల్లి గ్రామ ప్రజలపై స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా దండేపల్లి గ్రామానికి చెందిన అనేక మంది ప్రజలు, భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
మాచర్ల స్వప్న–శంకర్ దంపతులు మాట్లాడుతూ, దండేపల్లి గ్రామ భక్తుల కోసం ఇలాంటి అన్నదాన కార్యక్రమాలను ఎల్లవేళలా నిర్వహించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ముదిరాజ్ సంఘ సభ్యులకు ప్రత్యేకమైన అభినందనలు మాచర్ల శంకర్ దంపతులు తెలిపినారు