భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ APWJF శ్రీ సత్య సాయి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక సాయి ఆరామంలో ఎన్నిక కార్యక్రమం, భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు
APWJF జిల్లా అధ్యక్షుడిగా శివరామకృష్ణ ఎన్నిక
జర్నలిస్టుల సమస్యలపై తమ పోరాటం ఉదృతంగా ఉంటుందన్న నూతన కమిటీ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (APBJA) శ్రీ సత్య సాయి జిల్లా నూతన కార్యవర్గ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర స్థాయి నాయకుల సమక్షంలో, పుట్టపర్తి లోని సాయి ఆరామంలో ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఈ ఎన్నికల కార్యక్రమానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రాయలసీమ ఇన్ఛార్జ్ జయరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేపటి రామాంజనేయులు, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ నేతృత్వం వహించారు.
జర్నలిస్టుల భారీ ర్యాలీ – సాయి ఆరామంలో నామినేషన్లు:
ఎన్నికల కార్యక్రమానికి ముందు జిల్లా నలుమూలల నుండి వందలాదిగా తరలివచ్చిన జర్నలిస్టులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్య సాయి బాబా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గణేష్ సర్కిల్లోని సాయి ఆరామంలో నూతన జిల్లా కమిటీల ఎంపికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జర్నలిస్టులంతా ఏకతాటిపైకి వచ్చి రెండు అసోసియేషన్ల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ముఖ్య పీఠాలపై ఎన్నికైన ప్రతినిధులు:
APWJF జిల్లా అధ్యక్షుడు: ఎల్. శివరామకృష్ణ
APWJF జిల్లా ప్రధాన కార్యదర్శి: షబ్బీర్
APBJA జిల్లా అధ్యక్షుడు: కె. చలపతి
APBJA జిల్లా ప్రధాన కార్యదర్శి: కె. మురళి
జర్నలిస్టుల సమస్యలపై ఉధృత పోరాటం:
ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ విధానం అమలులో ఉందని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వాలన్నారు. కేవలం సానుభూతి మాటలు కాకుండా సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా తాము పనిచేస్తామన్నారు. నిజాయితీగా విధులు నిర్వహించే జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘జర్నలిస్ట్ భద్రతా కమిషన్’ ఏర్పాటు చేయాలని కోరారు.
నూతన కార్యవర్గ కమిటీల పూర్తి వివరాలు:
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF) కమిటీ:
కోశాధికారి (ట్రెజరర్): ఎస్. బాబ్జాన్
ఉపాధ్యక్షులు: ఎం. మహేష్, డి. శ్రీధర్ రెడ్డి, శివరాజ్, ఏ. ప్రవీణ్ కుమార్, పి. బాబ్జాన్
జాయింట్ సెక్రటరీలు: ఏ. జాకీర్ హుస్సేన్, ఆర్. రామకృష్ణ, రెడ్డి బాషా, హరి
ప్రచార కార్యదర్శి: జి. రాజశేఖర్
కార్యవర్గ సభ్యులు: జి. ఆంజనేయులు, బాబయ్య, ధర్మారెడ్డి, హనుమంత రెడ్డి, వినోద్ కుమార్, ఎస్.ఆర్. శ్రీనివాసులు, బి. శ్రీనివాసులు, నారాయణస్వామి, ఎం. ఓబుళపతి.
ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ (APBJA) కమిటీ:
ఉపాధ్యక్షులు: విశ్వనాథ్, వి. రామకృష్ణ, మురళీధర్ నాయుడు, రామాంజనేయులు
జాయింట్ సెక్రటరీలు: ఎన్. గిరీష్ బాబు, ఎన్. జగదీష్, సి. నరేష్
కోశాధికారి: గణేష్ ప్రచార కార్యదర్శి: చంద్రశేఖర్ కార్యవర్గ సభ్యులు: రాజా, శ్యాంసుందర్, రమేష్, లక్ష్మీకాంతప్ప, ఎం. హరికృష్ణ, కె. రామకృష్ణ, పులివెందుల నాగరాజు.