మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత శ్రీ లింగాల కేదారి, ఆయన భార్య దివంగత శ్రీమతి పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో లింగాల కేదారి, పుష్పలత అంకితభావంతో అందించిన సేవలను ముఖ్యమంత్రి  గుర్తు చేసుకున్నారు. కేదారి దంపతులు ఒక సాధారణ హోటల్ నడుపుతూ, అన్నం పరబ్రహ్మ...