BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 10:30 am Posted by : Reporter Srikanth

అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హనుమకొండ జిల్లాలో 55 టీచర్ పోస్టుల భర్తీకి అవకాశం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ, సెప్టెంబర్ 21: హనుమకొండ జిల్లాలోని మూడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 55 అంగన్‌వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. 

హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, హనుమకొండ, పరకాల ప్రాజెక్టుల పరిధిలో ఈ ఖాళీలు ఉన్నట్లు సమాచారం. సంబంధిత అర్హతలు కలిగిన మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 22 నుంచి 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు

భీమదేవరపల్లి – 23

హనుమకొండ – 19

పరకాల – 13

మొత్తం – 55 పోస్టులు

అర్హతలు

అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 2026 జూలై 1 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. సంబంధిత అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని స్థానిక మహిళలకు నిబంధనల ప్రకారం అర్హత ఉంటుంది. 

ఎంపిక విధానం

అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు ఒక్కో పోస్టుకు 100 మార్కుల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ ఉంటుందని సమాచారం. ఇంటర్మీడియట్ మార్కులకు 70 మార్కులు, వివిధ కేటగిరీలకు నిర్దేశిత వెయిటేజీతో పాటు ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించే విధానం అమల్లో ఉంది. 

అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు గడువు లోపు దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.