కరీంనగర్  తిమ్మాపూర్‌లో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ

అర్ధరాత్రి ఏటీఎంను పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్  తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ స్టేజీ వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టి నగదు చోరీ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో ఎవరూ లేని సమయాన్ని అదునుగా చేసుకున్న దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి...