ధ్రువీకరణ తప్పనిసరి.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఎల్పీజీ సబ్సిడీ కోసం అక్టోబర్ 1 నుంచి ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గృహ వినియోగ ఎల్పీజీ రీఫిల్పై సబ్సిడీ పొందాలంటే వినియోగ దారులకు ఆధార్ బయో మెట్రిక్ ధ్రువీ కరణ చేయాలని ప్రభుత్వం శనివారం నాడు తెలిపింది. ఎల్పీజీ వినియోగదా రులు నియంత్రిత రిటైల్ అమ్మకం ధర (ఆర్ఎస్పీ) వద్ద వర్తించే సబ్సిడీతో రీఫిల ను బుక్ చేసుకోవాలంటే బయోమె ట్రిక్ ఆధార్ ధృవీకరణ (బీఏఏ) పూర్తి ఉండాలని స్పష్టం చేసింది. ఎల్పీజీ సబ్సిడీ అర్హులైన కుటుంబాలకు మాత్ర మే చేరేలా చూసేందుకు ఈ చర్య తీసుకు న్నట్లు తెలిపింది. గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరణ పొందిన వినియోగదారునికి అనుసంధానించడం వల్ల సబ్సిడీతో కూడిన గృహ సిలిండర్లను వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు మళ్లించడాన్ని నివారించవచ్చని ప్రభుత్వం తెలిపింది. నకిలీ, అనర్హమైన కనెక్షన్లను తొలగించవచ్చని, సబ్సిడిని పాదర్శకంగా అందించవచ్చని పెట్రోలియం సహజ వాయువల మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరంలేదని పేర్కొంది. అక్టోబర్ 1 నుంచి ధృవీకరణ పూర్తి చేసిన వారు సబ్సిడీతో రీఫిల్ బుకింగ్ చేసేందుకు వీలు కలుగుతుంది. గ్యాస్ డీలర్ల వద్ద, ఆయా కంపెనీల వెబ్సైట్లలో, యాప్లోనూ ఆధార్ ధృవీకరణ పూర్తి చేయవచ్చని తెలిపింది. ధృవీకరణ పూర్తి చేయడానికి ఇష్టపడని వినియోగదారులు ఎలాంటి సబ్సిడీ లేకుండా 5 కేజీలు, 10 కేజీల సిలిండర్లను పొందవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 19 నాటికి దేశంల 27.43 కోట్ల మంది క్రియాశీల గృహ ఎల్పీజీ వినియోగదారులు బయోమెటరిక్ ధృవీకరణ పూర్తి చేశారని, ఇది 89.9 శాతం కవరేజీ పూర్తి చేసినట్లు తెలిపింది. బయోమెట్రిక్ ధృవీకరణ కోసం ఇప్పటికే పలుమార్లు పొడిగించారు. సెప్టెంబర్ నాటికి 14.2 కేజీల సిలిండర్ పై పరోక్ష సబ్సిడీ 210 రూపాయలుగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.