ఆకర్షణీయ రంగుల్లో యూనిఫాం ఇద్దాం ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో సుదర్శన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, అధికారులు రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏకరూప దుస్తులు, ఇతర సామగ్రి పంపిణీపై సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని, రెండో జతను ఈ నెలాఖరులోగా అందజేస్తామని సీఎంకు అధికారులు వివరించారు. కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు రెండు...