రాయపర్తి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

భీమ్ ఇండియా టుడే న్యూస్.వర్ధన్నపేట్   హన్మకొండ జిల్లా వర్ధన్నపేట రాయపర్తి: ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై రాయపర్తి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఎదుట శనివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రాయపర్తి గ్రామానికి చెందిన గారే వీరయ్య అలియాస్ మల్లయ్య (55) మృతి చెందినట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం.. వీరయ్య కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించేవాడు. వీరయ్యకు భార్య మరియమ్మతో పాటు కుమారుడు కృష్ణ, కుమార్తె శారద ఉన్నారు. రోజువారీ కూలీ పనులకు వెళ్లి తిరిగి...