భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహణ బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ మోదీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ – శివాలయంలో ప్రత్యేక పూజలు
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్కతుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మూడు రంగుల జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆనాటి రజాకార్ల అరాచకాలు, ప్రజలపై జరిగిన అక్రమాలు, తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో జరిగిన పోలీస్ చర్య ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, హక్కులు, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, యువతకు ఈ చారిత్రక విషయాలను వివరించాలని నాయకులు పిలుపునిచ్చారు.
మోదీ జన్మదిన వేడుకలు
అనంతరం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు, కార్యకర్తలకు పండ్లను పంపిణీ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ అభివృద్ధి, ప్రజాసేవలో చేస్తున్న కృషిని గుర్తుచేసుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఎల్కతుర్తి శివాలయంలో ప్రత్యేక పూజలు
తదుపరి ఎల్కతుర్తి శివాలయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, దేశం మరింత అభివృద్ధి చెందాలని శివుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు, మహిళా మోర్చా నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
జిల్లా కార్యవర్గసభ్యులు కుడుతాడి చిరంజీవి, పల్లెపాటి మధుకర్. మండల ప్రధాన కార్యదర్శులు అల్లి కుమార్, చీదురాల వెంకటేష్, , ఉపాధ్యక్షులు అభిరు శ్రీనివాస్, వేల్పుల శ్రీనివాస్, కడారి ప్రసాద్, కానుకుంట్ల రమణాచారి, కార్యదర్శులు కోడం రమేష్, చిర శ్రీనివాస్, మాటూరి విద్యాసాగర్.హింగే దేవరావు.సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, మూషిక వెంకటేష్, ఆడెపు శ్రీవర్ధన్, నాంపల్లి అశోక్, సల్పాల కిరణ్, దండ దేవేందర్ రెడ్డి, ఎడ్ల రఘోతం రెడ్డి, ఠాకూర్ శామ్ సింగ్, నార్లగిరి వెంకటేష్.సుఖినే సుధాకర్, కొమ్మిడి లచ్చిరెడ్డి, మంతుర్తి సమ్మయ్య, పోలు భిక్షపతి, ఉడుత సూర్యనారాయణ, మాజీ సర్పంచులు బూర్గుల రామారావు, భాస్కరరావు, కొమ్మిడి నిరంజన్ రెడ్డి,చల్ల రవీందర్ రెడ్డి.తక్కల్లపల్లి సంపత్ రావు, గణబోయిన నాగరాజు, పోలు నరేష్, చందా రామకృష్ణ, నార్లగిరి వెంకటేష్.గొర్రె ప్రవీణ్, సాతూరి ప్రభాకర్, చీరాల రంజిత్, ఎన్. మాధవరావు, మాచర్ల తిరుపతి, నారెడ్ల శంకర్, సతీష్, నగేష్, కిరణ్, నమ్మిండ్ల ప్రవీణ్, సందేలా మధు, వడ్లకొండ రమేష్, గూడెం నాగరాజు, వెల్డండి రాజేందర్, పోలు శివ, జేయందర్, గూడెల్లి శ్రీనివాస్. బొజ్జ కృష్ణం రాజు.మడిపల్లి కొమురయ్య.తదితరులు పాల్గొన్నారు.
మహిళా మోర్చా నాయకులు: మమతా, స్వాతి, కడారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.