హుజురాబాద్‌లో ఘనంగా విశ్వకర్మ భగవాన్ జయంతోత్సవాలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్, సెప్టెంబర్ 17: శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతోత్సవ కార్యక్రమాలను హుజురాబాద్ పట్టణంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబ సమేత దేవాలయంలో గురువారం విశ్వకర్మ భగవాన్ జయంతోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. జయంతోత్సవాల్లో భాగంగా ముందుగా విశ్వకర్మ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ యజ్ఞ కార్యక్రమంలో విశ్వకర్మ బంధువులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని...