ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో భక్తులకు భోజన వితరణ
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విగ్రహ దాత, అన్నదాన కార్యక్రమ నిర్వాహకులు మాచర్ల కవిత–శ్రీనివాస్ దంపతుల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు కలిసి భక్తులకు అన్నదానం చేశారు. ఎల్కతుర్తి సీఐ కొండ్రు శీను, ఎస్సై నరసింహారావు, ఎల్కతుర్తి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మాచర్ల...