తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ తిరంగా ర్యాలీ
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూనిన విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు దేశభక్తి నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు, పోరాట యోధులు చేసిన ఉద్యమాలను...